
J365 న్యూస్ : అసెంబ్లీ లో ఈరోజు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 2,75,891 కోట్ల రూపాయాలు. ఆరు గ్యారెంటీల కోసం రూ.53,196 కోట్లు అంచనా…
తెలంగాణ బడ్జెట్: పరిశ్రమల శాఖకు రూ. 2543 కోట్లు, ఐటీ శాఖకు రూ.774 కోట్లు. పంచాయతీ రాజ్ శాఖకు రూ.40,080 కోట్లు, పురపాలక శాఖకు రూ.11,692 కోట్లు.. మూసీ రివర్ ఫ్రాంట్ కు వెయ్యి కోట్లు, వ్యవసాయ శాఖకు రూ.19,746 కోట్లు, ఎస్సీ, ఎస్టీ గురుకుల భవన నిర్మాణాల కోసం రూ.1250 కోట్లు, ఎస్సీ సంక్షేమం రూ. 21,874 కోట్లు, ఎస్టీ సంక్షేమం రూ.13,013, రూ. మైనార్టీ సంక్షేమం రూ.2262 కోట్లు-భట్టి విక్రమార్క
మాది ప్రజల ప్రభుత్వం.. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెస్తామని మాట ఇచ్చాం.. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా హామీలు నెరవేస్తున్నాం.. తెలంగాణ సమాజం మార్పును కోరుకుంది.. సమానత్వమే మా ప్రభుత్వ లక్ష్యం-డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
బీసీ సంక్షేమం, బీసీ గురుకుల భవనాల నిర్మాణం కోసం రూ.1546 కోట్లు. బీసీ సంక్షేమం రూ8 వేల కోట్లు, విద్యా రంగానికి రూ.21,389 కోట్లు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు రూ.500 కోట్లు. యూనివర్సిటీల్లో సదుపాయాలకు రూ.500 కోట్లు, వైద్య రంగానికి రూ.11,500 కోట్లు, విద్యుత్ – గృహ జ్యోతికి రూ.2,418కోట్లు. విద్యుత్ సంస్థలకు రూ.16,825 కోట్లు.. గృహ నిర్మాణానికి రూ.7,740 కోట్లు. నీటి పారుదల శాఖకు రూ.28,024 కోట్లు- అని బట్టి విక్రమార్క బుడ్జెట్ సమావేశంలో తెలియజేశారు…
