Wed. Jan 28th, 2026

18నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని ట్రైబల్ వెల్ఫేర్ పీఎంహెచ్ హాస్టల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికులుగా పనిచేస్తున్న వారికి గత 18 నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని,క్యాటరింగ్ విధానం రద్దు చేయాలని,జీవో నెంబర్ 60 ప్రకారం 15600 వేతనం ఇవ్వాలని,ప్రతినెలా మొదటి వారంలో వేతనాలు చెల్లించాలని,డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో పీఎంహెచ్ హాస్టల్ ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ నిరవధిక సమ్మెను సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి అబ్దుల్ నబి ప్రారంభించారు.వ్యవసాయ కార్మిక సంఘం, ఎస్ ఎఫ్ ఐ నేతలు కడుదుల వీరన్న, వీరభద్రం,అభిమన్యు సంఘీభావం తెలిపారు. ఈ సమ్మె లో కుంజ జయ,ఈసం స్వరూప, హలావత్ అనిత,పాయం విజయ భారతి, తోలెం సుజాత,తాటి భారతి తదితరులు పాల్గొన్నారు.

Share this post...