Sat. Dec 21st, 2024

J365న్యూస్, జూలూరుపాడ్: రాష్ట్ర  అవతరణ కోసం అసువులు బాసిన అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ సభ్యులు పెండ్యాల విజయభాస్కర్ , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహాసభ పొలిటికల్ కమిటీ చైర్మన్ కొదుమూరి కోటేశ్వరరావు లు ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్యవైశ్యుల ఆణిముత్యం ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి ప్రాణాలర్పించి అమరజీవిఐన మహా పురుషుడు పొట్టి శ్రీరాములు అని ఆంధ్రులకు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైనవాడని మహాత్మా గాంధీ బోధించిన సత్యము అహింస హరిజనోద్ధరణ అనే ఆశయాల కొరకు జీవితాంతం కృషి చేసిన మహనీయుడని కొనియాడారు.

Share this post...