కొత్తగూడెం 9 ఫిబ్రవరి j 365 న్యూస్: డ్రై డే లో భాగంగా గ్రామపంచాయతిలలోని డంపింగ్ యార్డులను సందర్శించి, సేగ్రి గేషన్ షేడ్స్ నందు సేగ్రి గేషన్ జరిగే విధానాన్ని మరియు కంపోస్ట్ తయారీ విధానాన్ని పరిశీలించాలని చెప్పారు. సేగ్రిగేషన్ షెడ్ పరిసరాలు పరిపరిశుభ్రంగా ఉండేలా చూడాలని చెప్పారు.
అలాగే వైకుంఠధామాలు, సేగ్రీగేషన్ షెడ్, పల్లె ప్రకృతి వనాలు, ఇతర కమ్యూనిటీ ప్రాంతాలను పరిశీలించి కలుపు మొక్కలను, పిచ్చి పొదలు తొలగింపుకు చర్యలు చేపట్టాలని, ఇట్టి పనులకు ఉపాధి హామీ పధకం కూలీలు, గ్రామపంచాయతీ సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని చెప్పారు. అవెన్యూ ప్లాంటేషన్ పరిశీలించి పడిపోయిన చెట్లను సరిచేయాలని, చనిపోయిన మొక్కల స్థానంలో తిరిగి మొక్కలు నాటాలని చెప్పారు. హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణ చర్యల్లో బాగంగా నీరు పోయాలని చెప్పారు. ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో బాగంగా ప్రతి ఇంటిలో డ్రైడే పాటించే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. నర్సరీలను గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు విధిగా తనిఖీ చేసి మొక్కల సంరక్షణ చర్యలు, మొక్కలు పెంచుటకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ పేర్కొన్నారు.
