Tue. Feb 3rd, 2026

సారపాక  j365 న్యూస్: స్థానిక సారపాక లో గల బ్రిలియంట్ జూనియర్ కాలేజ్ నందు నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ మరియు జూవాలజి ప్రయోగశాలలను బ్రిలియంట్ విద్యాసంస్థల అధినేత బి ఎన్ ఆర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు, అనంతరం ల్యాబు ను విద్యార్థులను ఉద్దేశించి బి ఎన్ ఆర్ మాట్లాడుతూ ప్రయోగాలు జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి సోపానాలని ప్రతి ఒక్క దానికి కారణం ఉంటుందని అది ప్రయోగాల ద్వారానే రుజువు ఆతుందని కావున విద్యార్థులు అందరూ కూడా ఈ ల్యాబులను ఉపయోగించుకొని జరగబోయే ప్రయోగ పరీక్షలలో రాణించాలని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం విద్యార్థులు పాల్గొన్నారు.

Share this post...