Thu. Jan 29th, 2026

J365 న్యూస్, అనంతపురం:  అనంతపురం నగరంలోని అలేఖ్య ఫంక్షన్ హాల్ నందు ఆల్ ఇండియా ప్రజాసేన హక్కుల పోరాట సమితి ఏడవ ఆవిర్భావ దినోత్సవాన్ని వ్యవస్థాపక అధ్యక్షులు మన్నెపాకల మాధవ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రజాసంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేశారు. ఈ ఆవిర్భావ దినోత్సవానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ జడ్జి కిష్టప్ప పాల్గొన్నారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న విషయాలను క్లుప్తంగా వివరించారు. అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో రాజకీయంగా బడుగు, బలహీన వర్గాలకు ప్రాధాన్యత కల్పించాలని ఓటు అనే ఆయుధం ద్వారా రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పాలని తెలియజేస్తూ ఎస్సీ ,ఎస్టీ, మైనార్టీ ,బీసీ చెందిన కులాలలో బలమైన వారిని రాజకీయంగా ముందుకు తీసుకుని వెళ్లి అలాంటి వారిని చట్టసభల్లో స్థానం కల్పించే విధంగా ఓట్లు వేసి గెలిపించాలని తెలిపారు. అలాగే ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన్నెపాకుల మాధవ్ కు ప్రతి ఒక్కరూ కృతజ్ఞతలు తెలుపుతూ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే గత ఆరు సంవత్సరాల నుంచి ప్రజా సమస్యల పైన పోరాటం చేస్తూ ఎంతోమంది బడుగు ,బలహీన వర్గాల సమస్యలను పరిష్కరిస్తూ ,ప్రజల కోసం పనిచేస్తున్న మన్నెపాకుల మాధవ్ మరియు జిల్లా అధ్యక్షులు జిల్లా ప్రధాన కార్యదర్శి అంజి జిల్లా సలహాదారులు జిల్లా కన్వీనర్ రామాంజనేయులు నగర అధ్యక్షులు నరసింహులు నగర గౌరవ అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి నగర ప్రధాన కార్యదర్శి జగదీష్ నాయుడు నగర జాయింట్ సెక్రెటరీ భాష రాప్తాడు ఇన్చార్జ్ నల్లప్ప వారి పిహెచ్ఏ నాయకులకు ,కార్యకర్తల కు శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాగే ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తీరుస్తూ మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అనంతరం ఏడవ వార్షికోత్సవ కేక్ ను కట్ చేశారు. కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు ఎమ్మార్పీఎస్ మధు సామ్రాట్, పిఆర్ఎస్ఎస్ శ్రీరాములు, జన సంఘం కుల్లాయప్ప, ఐఎంఎం మహబూబ్ బాషా , సాకే హరి, ఎం. ఎం. డి .ఇమామ్, ఫైట్ ఫ్రమ్ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఆర్కె .రాజు, ముక్కోటి అంబికా చారిటబుల్ ట్రస్ట్ దంపెట్ల శివ, డాక్టర్ కుళ్లాయప్ప, యాంకర్ తరిమెల రాజు, ఎస్. సి మానిటరింగ్ కమిటీ బాల పెద్దన్న ,మాల మహానాడు గడ్డం ముత్యాలన్న , రామాంజి , డాక్టర్ సుధాకర్ , వినోద్ కుమార్ ,సోము ,ఎర్రి స్వామి, రుద్ర ,జావీద్ భాష ,శర్మాసు , జి. ఎం మురళీకృష్ణ ,తాడపత్రి అధ్యక్షులు నరేష్ ,ప్రధాన కార్యదర్శి , రాజశేఖర్ సహాయ కార్యదర్శి రామచందర్ ,ఇంద్ర ,మారెప్ప ,రాంపులయ్య ,కెపి రాజు , శ్రీనివాసులు, ఓబులాపురం అంజి, చిన్న, నాగరాజు ,రాజేష్ , సత్య సాయి జిల్లా ఇన్చార్జులు సుధామణి , పురందర ,పూసల సంఘం మండల అధ్యక్షులు శేషు , మధు ఇతర ప్రజా సంఘాల నాయకులు, ప్రజాసేన హక్కుల పోరాట సమితి సభ్యులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Share this post...