భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జులై 9న నిర్వహించనున్న సింగరేణి బాయిబాట–2వ విడత కార్యక్రమానికి టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటన షెడ్యూల్ విడుదలైంది.ఉదయం 7 గంటలకు కొత్తగూడెంలోని పీవీకే–5 గనిలో కార్మికులతో గేట్ మీటింగ్‌లో పాల్గొంటారు. అనంతరం ఉదయం 10 గంటలకు సూర్య ప్యాలెస్‌లో మీడియా సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు ఇల్లందు నియోజకవర్గంలోని బయ్యారం ఇనుపరాయి గుట్టను సందర్శించనున్నారు. సాయంత్రం 5 గంటలకు గుండాల మండలం శంభునిగూడెం గ్రామంలో తల్లిబిడ్డ మృతి చెందిన ఘటనలో బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.
