Thu. Jul 9th, 2026

J365 న్యూస్( రేగళ్ల పెద్ద తండా): పెద్ద తండా నుండి మునియా తండా వెళ్లే ప్రధాన ఆర్ అండ్ బి రహదారి ఇరువైపులా ముళ్లకంపలు, పిచ్చి మొక్కలు విస్తరించి సుమారు మూడు కిలోమీటర్ల మేర రహదారి ఇరుకుగా మారి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నయి. ఈ సమస్యను గుర్తించిన గ్రామ సర్పంచ్ లావుడ్య పూర్ణ స్వయంగా చొరవ తీసుకుని ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపు 12 గంటల పాటు అక్కడే ఉండి జేసీబీ, డోజర్ల సహాయంతో రహదారి ఇరువైపులా ఉన్న ముళ్లకంపలు, పొదలు, పిచ్చి మొక్కలను పూర్తిగా తొలగింపజేశారు. దీంతో రహదారి విశాలంగా మారి డబుల్ రోడ్డును తలపించేలా రూపుదిద్దుకుంది.

 

ఎన్నడూ లేని విధంగా ప్రధాన రహదారిని పూర్తిగా శుభ్రం చేయించడంతో వాహనదారులు, పాదచారులు, గ్రామ ప్రజలు ఇకపై ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణించగలరని స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రజలు సర్పంచ్ లావుడ్య పూర్ణ కి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, గ్రామాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న ఆయన సేవలను గ్రామ ప్రజలు కొనియాడారు.

Share this post...