J365 న్యూస్ వైరా :వైరా నియోజకవర్గం కారేపల్లి మండల కేంద్రంలో వందలాదిమంది వికలాంగులు, దివ్యాంగులు తమకు సదరం క్యాంప్ లో సర్టిఫికెట్ల కొరకు స్లాబ్ బుకింగ్ కోసం వచ్చిన వారి స్లాబు బుకింగ్ చేయకపోవడంతో మండల కేంద్రంలో ఆందోళనకు దిగిన వికలాంగులకు అండగా నిలబడ్డ సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొండబోయిన నాగేశ్వరావు, సిపిఎం మండల కార్యదర్శి కే నరేంద్ర, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మండల కార్యదర్శి వై. ప్రకాష్ తదితరులు పై పోలీసులు అక్రమంగా కేసులు బనయించడాన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భూక్యా వీరభద్రం తెలిపారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్న నాయకులపై క్రిమినల్ కేసులు పెట్టడం సబబు కాదని పోలీసు యంత్రాంగం పెట్టిన కేసులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా పాలనలో ప్రజల పక్షాన పోరాడే వారిపై కేసులు పెట్టడం రాష్ట్ర ప్రభుత్వానికి మంచిది కాదని గుర్తు చేశారు. ప్రజలు తమ హక్కుల కోసం రోడ్లపై నిరసన తెలియజేయడమే నేరంగా పరిగణించడం సరైనది కాదని అది ప్రజల హక్కు అని అన్నారు .వికలాంగులకు సదరం క్యాంపులు మండల కేంద్రాల్లో నిర్వహించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
