ప్రాణవాయువు ఆక్సిజన్ ఎంత అవసరమో కరోనా నేర్పింది… ఈ నేపథ్యంలో జీవ వైవిధ్యం, వాతావరణం సమతుల్యం ప్రకృతి పరిరక్షణ ఎంత అవసరమో నిత్యం మొక్కలు నాటుతున్న కె.యన్.రాజశేఖర్ నేర్పుతారు. ప్రస్తుతం సమాజంలోచిన్నారుల నుంచి పెద్దవాళ్ళవరకు అందరినీ మొక్కలునాటాలని ప్రోత్సహిస్తూ… అందరికి హరిత దీక్షా ఇస్తున్నారు.అనేక ప్రకృతి ప్రేమికుడుగా రాష్ట్ర జాతీయ స్థాయిలో అవార్డు అందుకున్న ఆయన దేశప్రధాని మోదీచే మన్కీబాత్ కార్యక్రమంలో ప్రశంసించబడిన విషయం అందరికీ తెలిసిందే. నేడు మొక్కలు రాజశేఖర్ కల్పన వివాహ వార్షికోత్సవ సందర్భంగా ప్రకృతి పర్యావరణంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలువురు ప్రముఖులు ఎంవిఐ వెంకట పుల్లయ్య,లయన్ దస్తగిరి,సామాజిక వేత్త లగడపాటి రమేష్ చంద్, సింగరేణి సీనియర్ లీడర్ గౌస్ భాయ్, సోషల్ మీడియా యుటిఎఫ్ కో కన్వీనర్ బాలు నాయక్, జిల్లాలోని ప్రముఖులు తదితరులు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపారు.