KTG:తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న రేషన్ బియ్యం పథకం అమలు పట్ల ప్రజల్లో స్పందన తెలుసుకునే క్రమంలో భాగంగా సన్నబియ్యం లబ్ధిదారుడు సుజాతనగర్ గరీబ్ పేట నర్సింగ్ వీరయ్య ఇంట్లో స్థానిక కాంగ్రెస్ నాయకులతో వెళ్లి టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు భోజనం చేశారు.సన్నబియ్యం అన్నం ఎలా ఉందమ్మా..! అని అడిగి తెలుసుకున్నారు.సీఎం రేవంత్ రెడ్డి సంకల్పంతో సన్న బియ్యం పేదలకు అందజేస్తున్నారని తెలిపారు.సన్న బియ్యం పంపిణీ విషయంలో ఎలాంటి అవకతవకలు లేకుండా, లబ్ధిదారులందరికి అవి అందేలా చూడలని కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కసనబోయిన భద్రం, మైనారిటీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు కరీంపాషా,ఓబీసీ సెల్ వెంకట్ యాదవ్, బీసీ సెల్ అధ్యక్షులు లక్ష్మణ్,నర్సింగ్ బిక్షం,వెంకన్న, పెద్ద వెంకన్న,రాములు, బి రవి, ఉపేందర్,పద్మ,వీరమ్మ, కృష్ణవేణి,సోషల్ మీడియా మండల కో-ఆర్డినేటర్ వీర భద్రం,మార్తి వెంకన్న,రామ్మూర్తి మధు,తిరుపతి,శ్రీను, వెంకటేష్,వేణు మరియు స్థానికులు పాల్గొన్నారు.
