పాల్వంచలోని ఆర్‌డీఓ కార్యాలయం ప్రాంగణంలో పార్క్ చేసిన స్కూటీ చోరీకి గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మణుగూరుకు చెందిన గుగులోత్ వీరన్న కిన్నెరసాని మోడల్ స్పోర్ట్స్ స్కూల్‌లో హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఈ నెల 26న సాయంత్రం TS 28 7027 నంబర్ గల తన స్కూటీని ఆర్‌డీఓ కార్యాలయం వద్ద పార్క్ చేశారు. సెలవులు, వర్షాల కారణంగా కొన్ని రోజులు ఆటోలో ప్రయాణించిన ఆయన గురువారం వెళ్లి చూడగా స్కూటీ కనిపించలేదు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పాల్వంచ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ఆచూకీ తెలిసిన వారు సెల్: 9652505066కు సమాచారం అందించిన వారికి తగిన పారితోషికం ఇవ్వబడుతుంది.
