Wed. Jan 28th, 2026

J365 న్యూస్ వైరా :  లయన్స్ క్లబ్ వైరా అధ్యక్షులు పెనుగొండ ఉపేంద్రరావు ఆధ్వర్యంలో ఈరోజు లయన్ కట్ల సురేష్ తండ్రిగారైన కీర్తిశేషులు కట్ల కృష్ణారావు  17వ వర్ధంతిని పురస్కరించుకొని ఖమ్మంలోని పాత బస్టాండు రైల్వే స్టేషన్ ల వద్ద వీధుల వెంబడి భిక్షాటన చేసుకొని జీవించే వారికి చికెన్ బిర్యానీ ప్యాకెట్స్ పంపిణీ చేయడమైనది. మరొక కార్యక్రమంలో గద్వాల్ రమేష్ కుమార్తె రవళి యొక్క జ్ఞాపకార్థ కూటమి సందర్భంగా ఎండిఓ ఆఫీస్ వద్ద హంగర్ రిలీఫ్ కార్యక్రమంలో భాగంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడమైనది. మరొక సందర్భంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి D.కరుణాకర్ రెడ్డి గారు, మీల్స్ ఆన్ వీల్స్ కోఆర్డినేటర్ చింతోజు నాగేశ్వరరావు, సీత, గద్వాల రవీందర్, కట్ల సురేష్, తాడికొండ రాము, నాగేశ్వరరావు, గద్వాల్ రమేష్ మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Share this post...