Thu. Jan 29th, 2026

J365 న్యూస్ : ఖమ్మం మరియు కొత్తగూడెం భద్రాద్రి టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ కి చెందిన క్రీడాకారులు గోవా నందు జరిగిన జాతీయ స్థాయి మాస్టర్ టేబుల్ టెన్నిస్ కాంపిటీషన్స్ నందు సింగిల్స్ మరియు డబుల్ విభాగంలో మెడల్స్ సాధించి ఖమ్మం జిల్లా ఖ్యాతిని ఇనుముడింప చేశారు. ఖమ్మం మరియు కొత్తగూడెం జిల్లాలకు చెందిన యాకూబ్ అలీ మరియు లోకేష్ ఇదుపుగంటి లు గోవా లో జరిగిన మాస్టర్ టేబుల్ టెన్నిస్ 30 సంవత్సరాల పైబడి నిర్వహించిన. ఈ పోటీల నందు తెలంగాణ రాష్ట్ర నుంచి పాల్గొన్న లోకేష్ మరియు యాకూబ్ అలీ లు సింగిల్స్ విభాగం నందు సిల్వర్ మరియు బ్రొంజు మెడల్సు సాధించారు ఈ విజయాల పట్ల ఖమ్మం  జిల్లా క్రీడా అధికారి సునీల్ రెడ్డి  ఖమ్మం జిల్లా టేబుల్ టెన్నిస్ అధ్యక్షులు బాలసాని విజయ   జిల్లా టేబుల్ టెన్నిస్ కార్యదర్శి ఓలేటి సాంబమూర్తి ఖమ్మం జిల్లా టేబుల్ టెన్నిస్ గౌరవ అధ్యక్షులు కూరపాటి ప్రదీప్ జిల్లా టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ట్రెజరర్ డాక్టర్ శశి కుమార్ హార్వెస్ పబ్లిక్ స్కూల్ చైర్మన్ రవి మారుతి  ఖమ్మం జిల్లా టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ప్రేమ్ కుమార్ ఈసీ సభ్యులు థామస్ , రియాజ్ , రియాజ్ షేక్,చలపతి పరిటాల , మహూబ్ అలీ, సాయీ శివ రెడ్డి లుయా కూబలి ,లోకేష్ విజయాల పట్ల హర్షం వ్యక్తం చేశారు

Share this post...