J365 న్యూస్, దమ్మపేట : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల పరిధిలోని జగ్గారం రెవిన్యూ పరిధిలో గల సర్వే నెంబర్ 400,400/2 చింతిర్యాలగూడెం గ్రామపంచాయతీ సర్వే నెంబర్ 191/1,192/2,190 లో గల భూములపై ఫారెస్ట్ అధికారులు, రెవెన్యూ అధికారులు సర్వే చేసి 8 నెలల గడుస్తున్నా ఇంతవరకు సర్వే రిపోర్ట్ ఇవ్వట్లేదు అదే విధంగా పట్టాలు ఇచ్చే విషయంలో జాప్యం చేస్తున్నారని, అదే విధంగా నెల్లిపాక రెవెన్యూ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమలను ఇళ్ల స్థలాలుగా కేటాయించాలని డీసీసీ భద్రాద్రి కొత్తగూడెం జనరల్ సెక్రటరీ మద్దిశెట్టి సామెలు పినపాక ఎమ్మెల్యే కి లేఖ రాయడం జరిగింది.
పినపాక ఎమ్మెల్యే తో ఫోన్ లో మాట్లాడిన మద్దిశెట్టి అట్టి లేఖను కార్యకర్తలు అయినా ఊకే సాయి కుమార్, కోరాం సురేష్, రవి, నరసింహారావు, నాగరాజు, జి. నరసింహారావు, మంగపతిరావు, రాజేష్ తదితరులు వెళ్లి పినపాక ఎమ్మెల్యే కి లేఖను అందజేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఫోరెస్ట్ మరియు రెవెన్యూ అధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 
