Tue. Feb 3rd, 2026

J365న్యూస్, ఖమ్మం: ఖమ్మం జిల్లా టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈనెల 28, 29, 30వ, తేదీలలో రాయల నారాయణ మెమోరియల్  రాష్ట్ర స్థాయి టేబుల్ టెన్నిస్ పురుషుల మహిళల బాలుర బాలికల మరియు కాడేట్స్ విభాగాల యందు రాష్ట్రస్థాయి పోటీలను నిర్వహిస్తున్న సందర్భంగా ఈరోజు సర్దార్ పటేల్ స్టేడియంలో ఆ పోటీలకు సంబంధించిన రాయల నారాయణరావు మెమోరియల్ పోస్టర్ని ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షులు బాలసాని విజయకుమార్, డాక్టర్స్ మెడికల్ అకాడమీ డైరెక్టర్స్ రాయల సతీష్, భరణి గారు, గుర్రం నరేన్, డాక్టర్ఎం, జి వి ప్రవీణ్, డాక్టర్ యస్మిత ,రెజొనేన్స్ అధినేత కొండా శ్రీధర్, వైస్ ప్రెసిడెంట్ ఎస్. ఉపేందర్, వి. రాంచందర్, జంగా కార్తీక్, డాక్టరు జొన్నలగడ్డ శశికుమార్, కోటగిరి ప్రవీణ్,కోశాధికారి పరిటాల చలపతి,పర్శ పవన్, జవహర్ పాషా , జాజి చాకో గౌరీ శెట్టి భవ్య చందు, పిట్టల కామేశ్వరి, పర్స శ్రావ్య, రెడ్డి సాయి శివ, ఆనెం రాజేష్ , ఎలప్రోలు లాలయ్య ఈ యొక్క పోటీలను రాష్ట లోని కరీంనగర్ నిజాంబాద్ వరంగల్ మంచిరియల ,కొత్తగూడెం పాల్వంచ నల్గొండ హైదరాబాద్ క్రీడాకారులని ఆహ్వానించామని ఈ క్రీడలు మొదటి రోజు మహిళల పురుషుల సింగిల్స్ మరియు డబుల్స్ పోటీలు జరుగుతాయని రెండవ రోజు నుండి 10,11,13,15, 17,19,బాలుర, బాలికల విభాగాల్లో పోటీలు జరుగుతాయని కార్యదర్శి తెలిపారు ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు ట్రోఫీ , మెడల్స్, మరియు క్యాష్ ప్రైజ్ రూపంలో బహుమతులు అందిస్తున్నామని పోటీల్లో పాల్గొనే ఆసక్తి గల క్రీడాకారులు జిల్లా కార్యదర్శి సాంబమూర్తి ఫోన్ నెంబర్ల 9848408335 ను సంప్రదించాలని కోరారు.

Share this post...