మొక్కలు నాటి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నా చిన్నోడు
ప్రకృతి దీక్ష భావితరాల రక్ష: మూడు విశ్వమిత్ర చౌహన్
J365 న్యూస్ కొత్తగూడెం: స్థానిక జిల్లా కేంద్రంలో యూకేజి చదువుతున్న మూడు విశ్వామిత్ర చౌహన్ ప్రకృతిపై ప్రేమతో తన తండ్రి మూడు జయరామ్ సహకారంతో పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ ఈ చిన్నారి బాల ప్రకృతి ప్రేమికుడిని అభినందించారు. అదేవిధంగా గతంలో ఉన్న కలెక్టర్,జిల్లా అధికారులు ఆయనకు ఉత్తమ ప్రకృతి ప్రేమికుడుగా ప్రశంస పత్రం అభినందనలు అందుకున్నారు. ముఖ్యమైన దినోత్సవం నాడు, ప్రముఖుల పుట్టిన రోజు నాడు విరివిగా మొక్క నాటుతూ అందరి ప్రశంసలు అందుకుంటున్నా విశ్వమిత్ర చౌహన్ ఎంతైనా అభినందనీయుడు.
