
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంట్రాక్టు ఉపాధ్యాయులను రెగ్యులర్ చేయాలని అంతటి వరకు మినిమం టైం స్కేల్ ఇవ్వాలని సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి పరీక్షలలో వంద శాతం ఫలితాలలోనే కాకుండా పాఠశాల విద్యా అభివృద్ధికి కృషి మరియు అటు విద్యా వ్యవస్థకు తల్లి తండ్రులకు నమ్మకాన్ని కలిగిస్తూ,నెల నెలా జీతాలు లేకుండా గత 20 సం. నుండి చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న వీరి సమస్యలను గత ప్రభుత్వం పరిష్కరించ లేదని,ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు.టైం పే స్కేల్,మహిళల ప్రత్యేక సెలవులు,హెల్త్ కార్డులు పలు అంశాలపై దీక్ష చేస్తున్నా అధికారులు చర్చలకు పిలవకపొడం పై పలు ఉపాధ్యాయ సంఘాలు, రాజకీయ పార్టీలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యలు పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని కోరుతున్నారు.
