దయామయులు దాయచూపక…. జీవితాలు సాగేదెల?? దీక్షా చేస్తున్నా.. ఆశ్రమ కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల పై కరుణ చూపరా?? ఉద్యోగ భద్రత లేక కుటుంబ భారాన్ని మోయలేక తీవ్రమైన ఆర్థిక మానసిక ఒత్తిడికి లోనై విద్యా బోధన చేస్తున్నారు.ఒకపక్క ఇంటి అద్దె, పిల్లల స్కూల్ ఫీజులు, రోజురోజుకు పెరిగిపోతున్న నిత్యవసర వస్తువుల ధరలు వీరిని మరింత కుంగదీస్తున్నాయి. గొంతెమ్మ కోర్కెలు కాదు కోరుకునేది… గ్రీన్ ఛానల్ ద్వారా ఐదు వేళ్ళూ.. నెలనెలా అందేలా మాత్రమే.. ప్రభుత్వ ఆదేశానుసారం మారుమూల ప్రాంతమైన… ఎక్కడైనా విధి నిర్వహణలో ఆత్మవిశ్వాసంతో పనిచేస్తున్నాము కానీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను మాత్రమే విస్మరించింది.
