Sun. Oct 4th, 2026

J365 న్యూస్ టేకులపల్లి: బాల్య వివాహాలను నిర్మూలించాలని, బాల కార్మిక వ్యవస్థను అరికట్టాలని లక్ష్యంగా (ఏఐడి ) ఎన్ జి ఓ జేఆర్సి ఆధ్వర్యంలో టేకులపల్లి మండలంలోని పలు గ్రామ పంచాయతీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి తీర్మానాలు చేయించారు.

 ఎయిడ్ ఎన్జీవో జే ఆర్ సి ప్రతినిధులు గ్రామ పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులతో సమావేశాలు నిర్వహించి బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను వివరించారు. బాల్య వివాహాలు జరగకుండా గ్రామస్థాయిలోనే అప్రమత్తంగా ఉండాలని, బాలికల విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

అదేవిధంగా బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, పిల్లలను పనుల్లో పెట్టకుండా వారి చదువుకు సహకరించాలని అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు, బాల కార్మికుల సమస్యలు కనిపిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు.

గ్రామ పంచాయతీల్లో నిర్వహించిన గ్రామసభల్లో బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా తీర్మానాలు చేయించి, గ్రామాలను బాల్య వివాహాలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

ఈ సందర్భంగా ఏయిడ్ ఎన్జీవో జే ఆర్ సి ప్రతినిధులు మాట్లాడుతూ, “బాల్య వివాహాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత. బాలలకు విద్య, రక్షణ, మంచి భవిష్యత్తు కల్పించేందుకు గ్రామస్థాయి నుంచి ఉద్యమంగా ముందుకు సాగాలి” అని అన్నారు. బాల్య వివాహాలు జరగకుండా గ్రామాల్లో నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, బాలల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తామని ఎయిడ్ ఎన్జీవో ప్రతినిధులు మాన్ సింగ్ తెలిపారు.

Share this post...