J365 NEWS,Mahabubabad: మహబూబాద్ జిల్లాలో సమగ్ర శిక్ష అభినయ్ కాంటాక్ట్ ఎంప్లాయిస్ ధర్నా కార్యక్రమంలో పాల్గొని సంఘీభావం తెలియజేశారు, ఈ సంఘీభావంలో పాల్గొన్న బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర కార్యదర్శి, మోకు దెబ్బ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు,ముంజాల రాజేందర్ గౌడ్,బీసీ రాజ్యాధికార సమితి మహబూబాబాద్ జిల్లా గౌరవ అధ్యక్షులు, తెలంగాణ గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు జెరిపోతుల వెంకన్న గౌడ్, బీసీ రాజ్యాధికార సమితి మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు గండి వీరేందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కొడుపుగంటి శ్రీధర్ గాడ్గే పాల్గొన్నారు,
ముంజాల రాజేందర్ గౌడ్ మాట్లాడుతూ సమగ్ర శిక్ష అభినయ్ కాంటాక్ట్ ఎంప్లాయిస్ ను విద్యాశాఖలోని విలీనం చేయాలని.
2014 తెలంగాణ గవర్నమెంట్ వస్తే కాంట్రాక్టు అనేది ఉండదని అందర్నీ రెగ్యులర్ చేస్తానని గత పాలకులు ప్రగల్బాలు పలికారు, కానీ 10 సంవత్సరాల కాలంలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టుగా ఇలాంటి కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు కూడా సరిగా ఇవ్వని పరిస్థితి ఏర్పడింది, గత ప్రభుత్వాలు ధర్నాలు అనేది ఉండవని చెప్పడం జరిగింది అంటే మేము ఏమనుకున్నామంటే ధర్నాలు అంటే అందరికీ సమస్యలు ఉండవు కావచ్చని అనుకున్నాం కానీ 2014 తర్వాత మా సమస్యలు ఎన్ని వచ్చినా కూడా మీ సమస్యలు ఎన్ని ఉన్నా కూడా ధర్నా చేయొద్దని మీ సమస్యల పైన కొట్లాడవద్దని గత ప్రభుత్వం ఎన్నో నిర్బంధాల గురిచేసింది, తర్వాత ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడక ముందు ఈ సమగ్ర శిక్ష అభినయ్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అందర్నీ రెగ్యులరైజ్ చేస్తానని ఒప్పుకోవడం జరిగింది, కానీ సంవత్సరం కాలం గడుస్తున్నా ఇంతవరకు వారిని పట్టించుకోని పరిస్థితి ఏర్పడింది,సమ్మె నోటీసు ఇచ్చి 25రోజుల నుండి శాంతి యూత ధర్నా చేస్తున్న ప్రభుత్వం పట్టించు కోవడం లేదు, తెలంగాణ లో మొత్తం 478 కేజీబీ స్కూల్స్ ఉన్నవి ఇందులో 1,20,000 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల పిల్లలు చదువు తున్నారు.. 25 రోజుల నుండీ వారు చదువుకు దూరమయ్యారు, ఇప్పుడు టెన్త్ క్లాసు ఇంటర్ ఎగ్జామ్స్ కూడా టైం టేబుల్ రావడం జరిగింది , మరి బడుగు బలహీన వర్గాల పిల్లలకు మరి చదువు అవసరం లేదా, ఉన్నత వర్గాలకే చదువ..ఆ విషయం పైన కూడా ప్రభుత్వం ఆలోచించాల్సిందే.
సమగ్ర శిక్ష అభినయ కాంటాక్ట్ ఎంప్లాయిస్ కు రాజ్యాంగం ప్రకారం అందరికీ సమాన హక్కు ఉందని, అదేవిధంగా 2005లో కేజీబీ ఏర్పడిందని దాంట్లో ఉన్న ఉద్యోగులకు ఇప్పటివరకు కాంటాక్ట్ బేసిక్ నే ప్రభుత్వ నడిపిస్తుందని, 2013 మోడల్ స్కూల్ ప్రారంభమైనవి అని అది రాష్ట్ర ప్రభుత్వం, వారిని రెగ్యులరైజేషన్ చేయడం జరిగిందని,గుర్తు చేశారు, సమగ్ర శిక్ష అభినయ కాంటాక్ట్ ఎంప్లాయిస్ వారు కూడా ఎగ్జామ్స్ రాసి ఇంటర్వ్యూలు పాసై రిజర్వేషన్ పద్ధతిలోనే వారు కాంట్రాక్ట్ ఉద్యోగులుగా రావడం జరిగింది, రెసిడెన్షియల్ స్కూలులో ప్రిన్సిపాల్ కు ఏ విధంగా జీతాలు వస్తున్నాయో ఎస్ఓ, కు కూడా అదే విధంగా జీతం రావాలని, టీజీటీకి ఏ విధంగా జీతం ఇస్తున్నారో సి ఆర్ టి,కూడా అదే విధంగా జీతం రావాలని, పిజిటి కి ఏ విధంగా జీతం ఇస్తున్నారో టీజీ సి ఆర్ టి, కూడా అదే విధంగా జీతభత్యాలు రావాలని ప్రభుత్వం నికి తెలియచేస్తూ కనీస వేతన చట్టం అమలు చేయాలని,,అదేవిధంగా డి ఎల్,జే ఎల్, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయడం జరిగింది కావున ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ సమగ్ర శిక్ష అభినయ్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ ను బోధన, బోధ నేతార సిబ్బందిని విద్యా శాఖలో విలీనం చేయాలని బీసీ రాజ్యాధికార సమితి డిమాండ్ చేస్తుంది అని అన్నారు,

