
గత 20 సంవత్సరాలుగా ఆశ్రమ పాఠశాలలో కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న మహిళలకు మెటర్నటీ లీవ్స్ కాని పిల్లల సంరక్షణ సెలవులు కూడా లేకున్నా విధులకు ఎప్పుడు సక్రమంగా హాజరవుతూ విద్యార్థుల భవిష్యత్తును నిర్మిస్తున్నామని.. ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు ఉపాధ్యాయ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా అధ్యక్షురాలు ఇర్ప సరస్వతీ ఆవేదనతో తన గళాన్ని వినిపించారు.ప్రభుత్వము వెంటనే స్పందించి న్యాయమైన కోరికలను పరిష్కరించాలి,లేనియడల ఆమరణ దీక్ష కూడా వెళ్లడానికి వెనుకాడబోమని ఆమె పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఇర్ఫా సరస్వతి అన్నారు.
