Thu. Jan 29th, 2026

ప్రతి ఒక్కరు పార్టీ కోసం పాటు పడాలని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు,మాజీ జిల్లా అధ్యక్షుడు కొదమ సింహం పాండురంగా చార్యులు అన్నారు.శుక్రవారం లక్ష్మీదేవి పల్లి సంజయ్ నగర్ లో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు గుట్టి ఉపేందర్ సింగ్,సతీమణిని ఘనంగా సన్మానించారు.మాలోత్ గాంధీ నాయక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కొదమ సింహం మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీకి ఎంతో మంది సీనియర్ నాయకులు పార్టీ గురించి అహర్నిశలు పాల్పడి ఎంతో మందికి స్ఫూర్తినిచ్చారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ధార్మిక్ సెల్ అధ్యక్షుడు గుమలాపురం సత్యనారాయణ, లక్ష్మీదేవి మండల అధ్యక్షులు మాలోత్ గాంధీ నాయక్, కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు గొడుగు శ్రీధర్ యాదవ్, రావుల రాము,రమేష్ పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Share this post...