Sat. Mar 21st, 2026

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నవంబర్ నెల 6వ తేదీ నుండి మూడు వారాల పాటు జరిగిన సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన ఉపాధ్యాయులకు రెమ్యూనరేషన్ ₹10000/-లను చెల్లించాలని TSUTF భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ తరపున జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి(CPO) సంజీవరావు గారికి ప్రాతినిధ్యం చేయడం జరిగింది. ఈ సందర్భంగా CPO గారు మాట్లాడుతూ.. రెమ్యునరేషన్ పైకమును మండల తహసీల్దార్ లకు పంపడం జరిగింది అని తెలిపారు.తాహసిల్దార్ కార్యాలయాల్లో త్వరలోనే రెమ్యూనరేషన్ ఇస్తారని తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బి రాజు,జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు ఎం.రాజయ్య జిల్లా కార్యదర్శి ఎస్ కే యాకూబ్ పాషా పాల్వంచ మండల అధ్యక్షులు ఏ విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Share this post...