Tue. Feb 3rd, 2026

అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలి:బిజెపి మండల అధ్యక్షులు మాలోత్ గాంధీ నాయక్కొత్తగూడెం : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగు సంక్షేమ పథకాల అమలు చేసే విధి విధానాలు, అర్హులని ఎంపిక చేసినందుకు పారదర్శకంగా చేపట్టాలని బిజెపి లక్ష్మిదేవిపల్లి మండల అధ్యక్షులు మాలోత్ గాంధీ నాయక్ ప్రభుత్వన్ని డిమాండ్ చేయారు. మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడతూ పథకాల అర్హుల ఎంపీక ప్రక్రియలు అధికారులు నిష్పక్ష పాతంగా, పారదర్శికంగా వ్యవహరించాలన్నారు.వ్యక్తి గత స్వలాభపేక్షకు పోకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందే విధంగా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఎన్నికల సమయలో ప్రజలకు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను నెరవేర్చుటలో కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. లబ్ధిదారులకు పథకాలు సమకూరుస్తామని జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఓట్లు పొందేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పథకాల గారడి చేస్తుందని విమర్శించారు.దేశ ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన అనేక పథకాలు చిర స్థాయిగా నిలిచిపోతున్నాయని, పేద ప్రజల సంక్షేమ దృష్టిలో ఉంచుకొని పథకాలు అమలులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేపడుతున్నారని అన్నారు.కేంద్ర ప్రభుత్వ అమలు చేసే సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో పల్లె స్థాయి నుంచి పట్నం స్థాయి వరకు అన్ని వర్గాల ప్రజలకు సమకూర్చడంలో బిజెపి పాలన ముందు ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో శివాజీ,వినోద్ కుమార్. నరసింహారావు,శివకుమార్. మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు

Share this post...