
కొత్త గూడెం మండలం లోని రామవరం టూ ఇంక్లైన్ ఏరియా కు చెందిన బాలిక సారియా. ప్రమాదవశాత్తు వేడి నీటిలో పడి తీవ్రంగా గాయపడింది . చిన్నారికి వైద్యం ఖర్చల కోసం రుద్రంపూర్ జమాతే ఇస్లామి సభ్యులు 12 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు షేఖ్ అబ్దుల్ బాసిత్ మాట్లాడుతూ, “కష్టాల్లో ఉన్న సాటి మనిషికి సహాయం చేయడమే నిజమైన దైవభక్తి” అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు అని, కులమతాలకు అతీతంగా జమాతే ఇస్లామి హింద్ విద్యా, వైద్యం కోసం సహాయం అందజేస్తుంది అని తెలిపారు. నిరుపేద కుటుంబానికి దాతలు ఎవరైనా వైద్యం కోసం సహాయం చేయాలని అనుకుంటే సంస్థ సభ్యులను సంప్రదించగలరని కోరారు.
ఈ కార్యక్రమంలో సాంఘిక సేవా విభాగం కార్యదర్శి రహీం, సభ్యులు అబ్దుల్ నజీర్, హఫీజ్, రబ్బానీ, ముస్తఫా, తదితరులు పాల్గొన్నారు.
