
గణతంత్ర దినోత్సవ సందర్భంగా మోడల్ స్పోర్ట్స్ స్కూల్ కిన్నెరసాని నందు స్పెషల్ ఆఫీసర్,గిరిజన సంక్షేమ శాఖ డివిజనల్ ఇంజనీర్. మధుకర్ తాండ్ర పోటీ పరీక్షలకు ఉపయోగ పడే పుస్తకాలను వితరణ చేసారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..విద్యార్థులు క్రీడలతో పాటు చదువులోనూ మంచిగా రాణించాలని అన్నారు.విద్యార్థులలో అంతర్లీన శక్తి ఎంతో ఉందని వారిని సన్మార్గంలో నడిపించేది ఉపాధ్యాయులు అని అన్నారు. గతంలో కూడా ఇదే పాఠశాల విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీషు పుస్తకాలు వితరణ చేసిన విషయం తెలిసిందే.ఆయన విద్యార్ధుల కోసం,విద్యాభివృద్ధి కోసం చేస్తున్న కృషికి అభినందనలు తెలిపారు. అనంతరం హెచ్ ఎం లోడిగా రామరావు మాట్లాడుతూ.. గిరిజన విద్యార్ధుల పట్ల తన ఔదార్యాన్ని చాటుకున్నారాని,వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాద్యాయ సిబ్బంది,విద్యార్థులు పాల్గొన్నారు.
