Fri. Jan 30th, 2026

యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ ఫౌండేషన్ వారి రక్తదాన అవగాహన మరియు అవయవ దాన పోస్టర్ ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. యువత సమాజ సేవ చేయడం ఓ బాధ్యతగా తీసుకోవాలని,రక్త దానం చేయడం ద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేషెంట్ ను కాపాడటమే కాకుండా తమను తాము రక్షిచుకుంటారని అన్నారు.అలాగే,అవయవ దానం చేయడానికి కూడా ప్రతి ఒక్కరు ముందుకు రావాలని,బాడీ మెడికల్ కళాశాలకు దానం చేయడం ద్వారా నాణ్యమైన డాక్టర్ లను తయారు చేయవచ్చని తెలిపారు.గత కొన్ని సంవత్సరాలుగా జె బి బాలు చేసేస్తున్న సేవలకు అభినందించారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు జె.బి.బాలు,గౌరవ అధ్యక్షులు లగడపాటి రమేష్, ప్రధాన కార్యదర్శి గుండపునేని సతీష్,సభ్యులు వెంకట్, జుబ్బు, రాజేష్,సతీష్,అక్రం పాల్గొన్నారు.

Share this post...