
మహాత్మా గాంధీ ఆదర్శాలు, సిద్ధాంతాలు, జీవిత చరిత్ర ఈనాటి విద్యార్థులకు మార్గదర్శకం అని ప్రాథమికోన్నత పాఠశాల కూనవరం ప్రధానోపాధ్యాయులు షేక్ మీరా హుస్సేన్ అమరవీరుల సంస్మరణ దినం( మహాత్మా గాంధీ వర్ధంతి) సందర్భంగా ప్రాథమికోన్నత పాఠశాల కూనవరంలో విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మహాత్మా గాంధీ ఆయుధాలైన అహింసా వాదం,సత్యాగ్రహం ఈనాటి యువతకు ఆదర్శం అన్నారు. విద్యార్థులు మహాత్మా గాంధీ జీవిత చరిత్రను అధ్యయనం చేయాలని, మహనీయుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకొని, జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. గాంధీజీ నిరాడంబరత, దేశభక్తి లను విద్యార్థులు అలవర్చుకోవాలన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుల త్యాగాలను నిత్యం స్మరించుకోవాలన్నారు. తొలుత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలతో నివాళులు అర్పించారు. రెండు నిమిషాలపాటు విద్యార్థిని విద్యార్థులు టీచర్స్ మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో టీచర్స్ కే సారయ్య రుక్మిణి సరిత రఘు మోహనరావు రేగా జయలక్ష్మి విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
