సుజాతనగర్ ఎంఇఓ లీలా అద్వర్యంలో గరీబ్ పేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీనివాస్ సమక్షంలొ మరియు ఆశ్రమ ఉన్నత పాఠశాల సర్వారం నందు ఇంపాక్ట్ క్లబ్ అధ్యక్షుడు, ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ జవ్వాది వేంకటేశ్వర బాబు చే పదవ తరగతి విధ్యార్దులకు రాబోయె బోర్డు పరీక్షల కు ఎలా తయారవ్వాలి, సబ్జెక్టులవారీగా ప్రిపరేషణ్,నవ రత్న సూచనలు, ఏ.బి.సి.డి. టెక్నిక్స్,స్డడీ ప్లాన్ ఎలా తయారు చేసుకోవాలి? దిన చర్య ఎలా తయారు చేసుకోవాలి,ఎలాంటి ఆహారం తీసుకోవాలి?మంచి నీరు త్రాగడం వలన ప్రయోజనాలు,నిద్ర,విశ్రాతి ప్రబావం మరియు పరీక్షహలులో తీసుకోవలసిన జాగ్రత్తలు, సూచనలు,చేయకూడని పనులు, జవాబులు రాయడం ఎలా మొదలు పెట్టాలి అన్న విషయాల పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాద్యాయనీ..ఉపాధ్యాయులు సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
