
భద్రాద్రి కొత్తగూడెం క్రీడా పాఠశాలలో 5వ తరగతిలో ప్రవేశానికి ఎంపికలు.మార్చి 26వ తేదీ నుండి క్రీడా పాఠశాల పైనల్ ఎంపికలు.బాలికలకు స్పోర్ట్స్ స్కూల్ కాచనపల్లిలో సెలక్షన్స్,బాలురకు స్పోర్ట్ స్కూల్ కిన్నెరసాని సెలక్షన్స్,డివిజనల్ స్థాయిలో హాజరు కాని విద్యార్థులు నేరుగా కూడ పాల్గొనవచ్చు.భదద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి బి రాహుల్ ఐ ఏ ఏస్ మరియు డిప్యూటీ డైరెక్టర్ మణెమ్మ ఆదేశానుసారం జిల్లాలోని క్రీడా పాఠశాలలకు 2025-26 విద్యా సంవత్సరానికి ఐదవ తరగతి ప్రవేశాల కొరకు ఐ టి డి ఏ భద్రాచలం పరిధిలోని ఫైనల్ ఎంపికలు 26.03.2025 నాడు బాలురకు క్రీడా పాఠశాల కిన్నెరసాని నందు జరుగుతాయని అదేవిధంగా 27.03.2025 నాడు బాలికలకు క్రీడా పాఠశాల కాచనపల్లి నందు ఎంపికలు జరుగుతాయని ఐటిడిఎ భద్రాచలం క్రీడల అధికారి బొల్లి గోపాలరావు అన్నారు.ఈ ఫైనల్ ఎంపికలకు ఎంపిక కాబడిన విద్యార్థులు అందరు కూడా మరియు ఇంకా ఎవరైనా విద్యార్థులు ఉన్నట్లయితే వారు కూడా డైరెక్టుగా ఫైనల్ ఎంపికలలో పైన తెలుపబడిన బాలురకు క్రీడా పాఠశాల కిన్నెరసానిలో మరియు బాలికలకు క్రీడా పాఠశాల కాచనపల్లి లో ఫైనల్ ఎంపికలలో పాల్గొనవచ్చుననీ అన్నారు.ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు గమనించి మీ యొక్క విద్యార్థులను 26-03-2025 ఉదయం బాలురు కిన్నెరసాని యందు 8:30 గంటలకు రిపోర్టు చేయగలరు.మరియు బాలికలు కాచనపల్లి క్రీడాపాఠశాలలో రిపోర్ట్ చేయగలరు అని క్రీడల అధికారి బొల్లి గోపాలరావు తెలియజేశారు. ఎంపికల కొరకు విద్యార్థుల వెంటతీసుకు రావలసినవి ద్రువ పత్రాలు స్టడీ సర్టిఫికెట్,ఆధార్ కార్డు జిరాక్స్,పాస్ ఫొటోస్ 2, టీ షర్ట్ -షర్ట్, డివిజనల్ స్థాయిలో బాలురు 296 బాలికలు,269 మొత్తం 565 మంది విద్యార్థులు పాల్గొన్నారు 1:2 రేషియో ఫైనల్ ఎంపికలో పాల్గొంటారు.ఈ కార్యక్రమంలో కిన్నెరసాని మరియు కాచనపల్లి ప్రధానోపాధ్యాయులు లోడిగా రామారావు,కురుసం వెంకటేశ్వర్లు,ఎ ఎస్ ఓ వెంకటనారాయణ,పిడి బాలసుబ్రమణ్యం,వార్డెన్ భట్టు శంకర్ మరియు కోచెస్ తదితరులు పాల్గొన్నారు
