కొత్తగూడెం లీగల్ : డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో పరువురు వ్యక్తులకు జరిమాన విదిస్తూ కొత్తగూడెం స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ మెండు రాజమల్లు బుధవారం తీర్పు చెప్పారు. కేసులు వివరాలు ఇలా…. పాల్వంచ టౌన్ ఎస్. ఐ. డి. రాఘవయ్య వాహన తనిఖీ చేయుచుండగా ఇద్దరు వ్యక్తులు అతిగా మద్యం తాగి తమ తమ వాహనం నడుపు చుండగా వారిని ఆపి బ్రీత్ ఎనలైజర్ ద్వారా పరీక్షించగా అతిగా మద్యం త్రాగినట్లు రికార్డు కాగా వారిని కోర్టులో ప్రవేశపెట్టగా రెండు కేసులలో జరిమానా చెల్లించారు. మరియు లక్ష్మీదేవిపల్లి ఎస్సై జి.రమణారెడ్డి వాహన తనిఖీ చేయుచుండగా నలుగురు వ్యక్తులను బ్రీత్ ఎనలైజర్ ద్వారా పరీక్షించగా మద్యం త్రాగినట్టు రుజువు కాగా కోర్టులో ప్రవేశపెట్టగా నలుగురికి జరిమానా విధించారు