జూలూరుపాడు మండలం కొమ్ముగూడెం గ్రామం వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.ఖమ్మం వైపు నుంచి వస్తున్న కారు ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేయబోయే ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న కరవారిగూడెంకి చెందిన కోటియ, లక్ష్మీ దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి.కాగా కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొని స్థానిక పెద్దమ్మతల్లి ఆలయ ప్రహరిని ఢీకొని ఆగిపోయింది.
