
సేవాలాల్ బంజారా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన చలో హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ నందు నిరాహార దీక్ష కార్యక్రమం విజయవంతం.సేవాలాల్ బంజారా సంఘం జాతీయ అధ్యక్షుడు కొర్ర మోతీలాల్ నాయక్ ఆధ్వర్యంలో సేవాలాల్ బంజారా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లావుడియా ప్రసాద్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ లంబాడ ఎమ్మెల్యేలు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కోరుతూ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది.ఈ దీక్షను ఉద్దేశించి మాట్లాడుతూ ఎమ్మెల్యేలను మంత్రివర్గంలో తీసుకోకపోతే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని లంబాడి సామాజిక వర్గం బహిష్కరిస్తుందని రానున్న స్థానిక సంస్థ సైనికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి కోసం పనిచేస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులను గ్రామాల్లో తిరగనివ్వమని అన్నారు ఈ రిలే నిరాహార దీక్షతో కాంగ్రెస్ పార్టీ పునారాలోచన చేసుకొని లంబాడ సామాజిక వర్గాన్ని మంత్రివర్గంలో తీసుకోవాలి లేని పక్షంలో రానున్న రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడి గాంధీభవన్ ముట్టడిస్తామని ప్రకటించారు ఒక్కరోజు ధర్నా నిరాహార దీక్ష కార్యక్రమంలో సేవాలాల్ బంజారా సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు నునావత్ రాంబాబు నాయక్ జిల్లా కార్యదర్శి ధారావత్ నాగరాజు నాయక్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శ్రీనివాస్ నాయక్ సుజాతనగర్ మండల అధ్యక్షుడు బాలాజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు
