Wed. Jan 28th, 2026

ప్రభుత్వం రాబోయే విద్యా సంవత్సరానికి ఉపాధ్యాయులను సర్దుబాటు చేయుటకు విడుదల చేసిన ఉత్తర్వులు అశాస్త్రీయంగా ఉన్నాయని వీటిని ఉప సంహరించి సవరణ ఉత్తర్వులు జారీ చేసి సర్దుబాటు ప్రక్రియ చేపట్టాలని టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బుర్రి రాజు,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు మురళీ మోహన్,యం వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.ప్రాథమిక పాఠశాలలను ఈ సర్దుబాటు ప్రక్రియ తీవ్రంగా దెబ్బతీస్తుందని,టీచర్లు లేక పిల్లల్లో విద్యా ప్రమాణాలు పడిపోతాయని తెలిపారు.11 మంది విద్యార్థులకు ఇద్దరు టీచర్లు 60 మందికి కూడా ఇద్దరు టీచర్లతోనే బోధన ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. వర్కుబుక్స్ ఉన్న నేపథ్యంలో 15 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు తప్పనిసరిగా ఉండాలని అన్నారు. రేషనలైజేషన్ నిబంధనల జీవో 25ను సవరించాలని కోరారు. నమోదు పెంచి,విద్యా ప్రమాణాలు పెంచాలని ఒకవైపు శిక్షణలు ఇస్తున్న ప్రభుత్వం,అశాస్త్రీయ సర్దుబాటు ఉత్తర్వులు ఇచ్చి విద్యారంగాన్ని ఏం చేయదలచుకున్నదని ప్రశ్నించారు.సంఘాలతో చర్చించి ఆమోదయోగ్యమైన సర్దుబాటు ఉత్తర్వులు వెలువరించాలని, కోరారు. ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తిని సవరించాలని,50 మంది విద్యార్థులు ఉన్న చోట తరగతికి ఒక ఉపాధ్యాయుడిని కేటాయించాలని,నర్సరీ,కేజీ తరగతులు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.

Share this post...