
టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగా సీతారాములు ను చాతకొండ కాంగ్రెస్ నాయకులు శాలువాతో సత్కరించి సన్మానం చేశారు. ప్రజా సేవకుడిగా,సామాజిక సేవలందిస్తూ, ప్రజల సమస్యలనే తన సమస్యలుగా గుర్తించి, ప్రజలకు తోడుగా ఉండే నాగా సీతారాములుకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తు కాంగ్రెస్ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్బంగా నాగా సీతారాములు మాట్లాడుతు ప్రజా సేవకుడిగా,ప్రజలలో ఒకడిగా ఉంటూ మీ కోసమే పనిచేస్తానని,కార్యకర్తలకు అండగా ఉంటానన్నారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి చాతకొండ కాంగ్రెస్ నాయకులు కొంపెల్లి వీరయ్య,చింత రమేష్,రావు కిరణ్ కుమార్,వజ్జా చందు, దెయ్యాల సమ్మయ్య,ఉబ్బని రాజు,రావు మధు, కడియాల సత్యనారాయణ,బోయనపల్లి రాము,వల్లభనేని శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు
