
లంబాడీ సామాజిక వర్గానికి మంత్రి పదవి కేటాయించని కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం.మంత్రి పదవి సాధించేవరకు సేవాలాల్ బంజారా సంఘం ఆధ్వర్యంలో పోరాటాన్ని ఉధృతం చేస్తాం.ముందస్తు అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరనీ సేవాలాల్ బంజారా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లావుడియా ప్రసాద్ నాయక్ అన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో లంబాడీ సామాజిక వర్గానికి మంత్రి పదవి కేటాయించాలని సేవాలాల్ బంజారా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లావుడియా ప్రసాద్ నాయక్ అడ్డుకుంటామని పిలుపునిచ్చారు.ఈ మేరకు లక్ష్మీదేవి పల్లి పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.భద్రాద్రి జిల్లావ్యాప్తంగా సేవాలాల్ బంజారా సంఘం నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారని చెప్పారు.లంబాడీ సామాజిక వర్గానికి మంత్రి పదవి కేటాయించని కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం అని ఆయన హెచ్చరించారు. మంత్రి పదవి సాధించేవరకు సేవాలాల్ బంజారా సంఘం ఆధ్వర్యంలో పోరాటాన్ని ఉధృతం చేస్తాం చెప్పారు. ముందస్తు అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని అన్నారు. లంబాడీల ఓట్లతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ నేడు లంబాడీలను విస్మరించడం సరికాదన్నారు. తెలంగాణలో బంజారాలను అణచివేసే కుట్ర జరుగుతోందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు.అరెస్టు అయిన వారిలో సేవాలాల్ బంజారా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లావుడియా ప్రసాద్ నాయక్,సేవాలాల్ బంజారా సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు నునావత్ రాంబాబు నాయక్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బానోత్ శ్రీనివాస్ నాయక్ జిల్లా ఉపాధ్యక్షుడు భూక్య.హరీష్ నాయక్,జిల్లా కార్యదర్శి ధరావత్ నాగరాజు నాయక్, మహిళ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందిని భాయ్, రాష్ట్ర కార్యదర్శి బట్టు వీరన్న నాయక్, రాష్ట్ర కోశాధికారి తేజావత్ రవికుమార్ నాయక్, రాష్ట్ర విద్యార్థి భాగం బోడ శ్రీనివాస్ నాయక్,సేవలాల్ సేన జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్ నాయక్, సేవాలాల్ సేన జిల్లా ప్రచార కార్యదర్శి లాలు నాయక్, ముఖ్య నాయకులు ఉన్నారు.
