Sat. Mar 21st, 2026

J365 NEWS,Kothagudem:  సెప్టెంబర్ 13న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టులో జరిగే జాతీయ లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్ కోరారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి రాజేందర్ మాట్లాడుతూ కక్షిదారులు తమ వివాదాలను సామరస్యంగ, త్వరగ పరిష్కరించుకోవడానికి జాతీయ లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. రాజీకి వచ్చే సివిల్‌, క్రిమినల్‌, వివాహ బంధానికి సంబంధించిన కేసులు, చెక్ బౌన్స్ కేసులను పరిష్కరించుకోవచ్చని, సమయము డబ్బు ఆదా ఆవుతుందని తెలిపారు.

Share this post...