Mon. Feb 2nd, 2026

J365 NEWS, భద్రాచలం 13 సెప్టెంబర్ 25:నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆదివాసి యువకుడు పట్టుదలతో, ఏకాగ్రతతో మొక్కవోని దీక్షతో ప్రభుత్వ పాఠశాలలో చదివి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ యం ఏ హిస్టరీలో సీటు సంపాదించిన పాయం కాంతారావు తోటి విద్యార్థులకు స్ఫూర్తి నింపడానికి మార్గదర్శకుడిగా నిలవడం చాలా సంతోషమని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ అన్నారు.

శనివారం నాడు తన చాంబర్లో దుమ్ముగూడెం మండలం తాటివారిగూడెం గ్రామానికి చెందిన పాయం కాంతారావు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎం ఏ హిస్టరీలో సీటు సంపాదించాడని ఆయన అన్నారు. అతను ఎంఏ హిస్టరీ కోర్స్ చదవడానికి ఐటీడీఏ ద్వారా ప్రోత్సాహకంగా 30 వేల రూపాయల చెక్కును అతనికి అందించడం జరిగిందని అన్నారు. చెక్కు అందించిన అనంతరం యువకుడిని అభినందిస్తూ ఖాళీ సమయంలో క్రింది తరగతి విద్యార్థులకు తప్పనిసరిగా మీ యొక్క ప్రతిభను వారికి తెలియజేసి చదువు పట్ల మక్కువ కలిగేలా స్ఫూర్తి నింపాలని, తల్లిదండ్రుల మీద ఆర్థిక భారం మోపకుండా నెలకు కొంత ఆర్థిక వెసులు బాటు చేసుకోవడానికి ప్రయత్నించాలని యువకుడికి ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. 

Share this post...