Sat. Jan 31st, 2026

     భద్రాద్రి జిల్లా లక్ష్మీదేవి పల్లి మండల హేమచంద్రాపురం నందు గల జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు సోమవారం దసరా నవరాత్రుల సందర్భంగా ఆయుధ పూజను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జరిగిన పూజలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ పాల్గొన్నారు.ఎస్పీ తో పాటు అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ నరేందర్,కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్,డీసిఆర్బీ డిఎస్పీ మల్లయ్యస్వామి,ఏఆర్ డిఎస్పీ సత్యనారాయణ,సైబర్ క్రైమ్స్ డిఎస్పీ అశోక్ మరియు సీఐలు,ఆర్ఐలు ఇతర పోలీసు అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.ఆయుధ పూజ అనంతరం వాహన పూజ నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ భక్తి శ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవడంలో భాగంగా ఆయుధ పూజా కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం గా ఉందని తెలియజేశారు.ఈ సందర్బంగా జిల్లా ప్రజలకు,పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం జిల్లా పోలీసు అధికారులు మరియు సిబ్బందికి ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

Share this post...