కొత్తగూడెం: విద్యార్థులకు చదువుతో పాటు బాక్సింగ్ క్రీడ వల్ల ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలంగాణ బాక్సింగ్ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు ఎల్లయ్య బండారి అన్నారు.ఉమ్మడి ఖమ్మం జిల్లా బాక్సింగ్ శిక్షణ తరగతుల పర్యవేక్షణలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు విచ్చేసిన ఆయన కొత్తగూడెం పట్టణంలోని ప్రగతి మైదానంలో,రామవరంలో బాక్సింగ్ శిక్షణ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోని కొన్ని చిన్న దేశాల పేర్లను సైతం గుర్తు పెట్టుకోవటానికి అక్కడి ప్రజలు క్రీడల్లో రాణించడమే కారణమన్నారు.బాక్సింగ్ సాధనలో భాగంగా విద్యార్ధులకు బాక్సింగ్ లో గెలుపొందుటకు మెలుకువలు నేర్పించారు.తల్లిదండ్రులు పిల్లలను చదువుకే పరిమితం చేయకుండా క్రీడల్లోను ప్రోత్సహించాలని కోరారు.ఒలింపిక్స్ లో కూడా బాక్సింగ్ క్రీడ వున్నందున క్రీడకారులకు ఉద్యోగ అవకాశాలు త్వరగా లభిస్తాయని తెలిపారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం,రామవరం,భద్రాచలం ప్రాంతాల్లో బాక్సింగ్ శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని ఆసక్తి కలిగిన వారికి ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని,త్వరలో ఇల్లందు,మణుగూరులలో బాక్సింగ్ శిక్షణ తరగతులు ప్రారంభించనునట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా బాక్సింగ్ చీఫ్ ప్యాట్రన్ యెర్రా కామేష్,జిల్లా ప్రధాన కార్యదర్శి వై.శివ సుబ్రమణ్యం,కోచ్ లు ఈశ్వర్, సాగర్,కిరణ్,శ్రీమూర్తులు తదితరులు పాల్గొన్నారు
