Wed. Jan 28th, 2026

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలో మరియు వసతి గృహాలలో చదువుతున్న గిరిజన విద్యార్థిని విద్యార్థులను ఈ నెలలో జరిగే డివిజన స్థాయి క్రీడా పోటీలలో పాల్గొనేలా సంబంధిత హెచ్ఎం,వార్డెన్, పిడి,పీఈటీలు ప్రత్యేక బాధ్యత తీసుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి బి.రాహుల్ గురువారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.గిరిజన క్రీడల ఎంపిక పోటీలు ఐటీడీఏ భద్రాచలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయి పరిధిలో ఉన్న ఆశ్రమ ఉన్నత పాఠశాలలు,వసతి గృహాలలో చదువుతున్న బాల, బాలికలు డివిజనల్ స్థాయి గిరిజన క్రీడా పోటీలు జిల్లాలో దుమ్మగూడెం,మణుగూరు,దమ్మపేట, పాల్వంచ, ఇల్లందు 5 డివిజనులుగా విభజించడం జరిగినందున ఈ డివిజనల్ స్థాయి క్రీడా ఎంపికలు ఆయా కేంద్రాల్లో ఈనెల 17, 18 తేదీలలో నిర్వహించబడతాయని, సంబంధిత పిడి,పీఈటీలు విద్యార్థిని విద్యార్థులను చాలా బాధ్యతలు క్రీడలు జరిగే సెంటర్లకు తీసుకొని వచ్చి తప్పనిసరిగా వారికి ఇష్టమైన క్రీడలలో పాల్గొనేలా చేసి ఈ క్రీడా ఎంపికలను విజయవంతం చేయాలని ఆయన కోరారు.

Share this post...