ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా గణిత దినోత్సవాన్ని ఆశ్రమ ఉన్నత పాఠశాల కరకగూడెం లో ఘనంగా జరుపుకున్నారు.మనిషి జీవితానికి గణిత శాస్త్రానికి విడదీయరాని సంబంధం ఉందని ఆయన ప్రపంచ స్థాయి గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ సేవలను స్మరించుకుంటూ, గణితాన్ని మానవాళికి మరింత ఉపయోగకరంగా మార్చే దిశగా విద్యార్థులు కృషి చేయాలని హెచ్ ఎం టి.రామచందర్ రావు సూచించారు.ఈ కార్యక్రమంలో హెచ్.ఎం. రవీందర్,వార్డెన్ సాయన్న జనార్దన్ సరోజిని గంగరాజు,శేఖర్,టి.అశోక్,భీంసింగ్, జె.బాలాజీ పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు
