Tue. Sep 8th, 2026

            ఈ నెల 10న నిర్వహించనున్న ‘ఛలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ సోమవారం టీ.జీ.ఈ.జేఏసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పక్షాన సన్నాహక సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, వివిధ ఫోరంల జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హాజరై కార్యక్రమ విజయవంతానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.ఉద్యోగ,ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Share this post...