Sat. Sep 12th, 2026

  ఏన్కూరు, సెప్టెంబర్ 11: మండల కేంద్రంలో నిర్వహించిన ఎస్‌జీఎఫ్‌ క్రీడా పోటీల్లో ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. అండర్‌-14 వాలీబాల్‌లో విజేతలుగా, అండర్‌-17లో రన్నరప్‌గా నిలిచి 13 మంది విద్యార్థులు జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జ్‌ హెచ్‌ఎం బి.రవి, డిప్యూటీ వార్డెన్‌ డీఎస్‌.నాగేశ్వరరావు విద్యార్థులను అభినందించారు. జిల్లా స్థాయిలోనూ ప్రతిభ కనబరిచి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థుల విజయానికి కృషి చేసిన పీడీ బి.సక్రామ్‌ను అభినందించారు.

Share this post...