Sat. Sep 12th, 2026

కొత్తగూడెం: తెలంగాణ స్టేట్ ట్రైబల్ టీచర్స్ ఫెడరేషన్ (TSTTF) వ్యవస్థాపక సభ్యులు వాంకుడోత్ హాతిరాం తిరిగి సంఘంలో చేరారు. రాష్ట్ర అధ్యక్షులు భానోత్ వీరు నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భానోత్ రాములు నాయక్, రాష్ట్ర సలహాదారు ఎల్‌వీబీఎం రత్నాకర్, జిల్లా అధ్యక్షులు భూక్య మోహన్ రాథోడ్ సమక్షంలో ఆయన సంఘంలో పునఃప్రవేశం చేశారు.ఈ సందర్భంగా హాతిరాం మాట్లాడుతూ గిరిజన ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం తనవంతు కృషి చేస్తానని తెలిపారు. TSTTFను మరింత బలోపేతం చేసి సంఘ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. వ్యవస్థాపక సభ్యుడు తిరిగి సంఘంలో చేరడంతో శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బాబూలాల్, లక్ష్మీదేవిపల్లి మండల అధ్యక్షులు కృష్ణ, రాంబాబు, శోభన్ తదితరులు పాల్గొన్నారు.

Share this post...