Wed. Jan 28th, 2026

ఖమ్మం: రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి రాజకీయ ప్రస్థానంపై రైట్ చాయిస్ అకాడమీ చైర్మన్ మెండెం కిరణ్ కుమార్ ‘ శీనన్న శపథం’ శీర్షికతో రూపొందించిన ప్రత్యేక వీడియోను మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దయాకర్ రెడ్డి మాట్లాడుతూ.. నిత్యం జనం మధ్య ఉండే పొంగులేటిపై కొన్నేళ్లుగా జరిగిన రాజకీయ కుట్రలు, వాటిని ఆయన అధిగమించి రాష్ట్ర మంత్రిగా ఎదిగిన తీరును మెండెం కిరణ్ కుమార్ చక్కగా విశ్లేషించి చూపారని అభినందించారు. శీనన్నను అభిమానించే ప్రతి ఒక్కరూ మెచ్చేలా ఈ వీడియో ఉందని పేర్కొన్నారు.

Share this post...