Mon. Sep 14th, 2026

   ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మట్టి ప్రతిమలు ఉచిత పంపిణీ  లక్ష్మీ దేవి పల్లి మండల కేంద్రం ధారా కాంప్లెక్స్ లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్యవైశ్య మహాసభ,తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య యువజన సంఘం,మహిళా విభాగం ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయక ప్రతిమలను కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్ మరియు సిపిఐ జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా చేతుల మీదుగా పంపిణీ చేశారు.జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు ధారా రమేష్ ఆధ్వర్యంలో వరుసగా మూడో ఏడాది ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు విగ్రహ దాతలు దారా దైవశ్వంత్ (ఆస్ట్రేలియా), దారా ధీరజ్‌కు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ అడ్వకేట్ పల్లి సాంబశివరావు,సత్యసాయి పసుమర్తి అనంతం తదితరులు పాల్గొన్నారు.

Share this post...