Tue. Sep 22nd, 2026

పినపాక నియోజకవర్గంలోని ప్రధాన రహదారులు అక్కడక్కడ గుంతల మయంగా మారడంతో ప్రయాణికులకు ఇబ్బందులు కలగడంతో పాటు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, వెంటనే రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారుఆ ర్ అండ్ బి, పంచాయతీరాజ్ అధికారులను ఆదివారం చరవాణి ద్వారా ఆదేశించారు. నియోజకవర్గ ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నందున వెంటనే నియోజకవర్గంలోని అన్ని బీటీ రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు. అదే విధంగా రానున్న రోజుల్లో మేడారం సమ్మక్క సారక్క జాతర నేపథ్యంలో నిత్యం రాకపోకలు పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రమాద మలుపుల వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అధికారులు సంక్రాంతి పండుగ అనంతరం పనులు ప్రారంభించి నియోజకవర్గంలోని అన్ని ప్రధాన రహదారుల్లో ఇబ్బంది కరంగా మారిన రోడ్లను గుర్తించి మరమ్మతులు చేపడతామన్నారు.

Share this post...