Mon. May 18th, 2026

ఖమ్మం :తెలంగాణ గిరిజన సంక్షేమ ప్రతిభా కళాశాల (స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్) ఖమ్మం రీజినల్ లోని బాలురు కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరం కి ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఎంపీసీ, బైపీసీ కోర్సులలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎం.బాలస్వామి తెలిపారు. విద్యార్థులకు ఇంటర్ తో పాటు ఐఐటి – జేఈఈ, నీట్ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ సదుపాయము కల్పించును. మార్చి 2024లో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరవుతున్న ఎస్ టి బాలురుల నుండి ఆన్లైన్లో ద్వారా www.tgtwgurukulam.telangana.gov.in దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు పైన పేర్కొన్న వెబ్సైట్ ద్వారా 200 రూపాయలు చెల్లించి 05-02-2024 లోపు దరఖాస్తులను సమర్పించాలని ప్రిన్సిపాల్ కోరారు

Share this post...